ePaper
Thursday, March 26, 2026
ads
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రకాశంవీరేపల్లిలో మేలుజాతి లేగదూడల ప్రదర్శన.

వీరేపల్లిలో మేలుజాతి లేగదూడల ప్రదర్శన.

📰 Generate e-Paper Clip

* ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ఈఓ మురళీకృష్ణ.
* అందాల పోటీల ప్రదర్శనలో 43 లేగదూడలు.
ఉలవపాడు, పెన్ పవర్ న్యూస్.(కళ్యాణ్).

జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, బంగోలు వారి తరుపున పశు సంవర్ధక వారి సహకారంతో వీరేపల్లి మేజాతి లేగ దూడల ప్రదర్శన(అందాల పోటీలు) గురువారం ఘనంగా జరిగింది. ఈ పేరు బంగోలు జిల్లా పశుగాకాభివృద్ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా:మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరైన కారణంగా. ఈ ప్రదర్శనకు 43 లేగదూడలు, 32 మంది రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శనకు వచ్చిన లేగ దూడలుకు ఏలికపాముల మందులు, మినరల్ ఇటుకలు, బీ కాంప్లెక్స్ మందులను ఇచ్చి, హాజరైన ప్రతీ రైతుకు బహుమతులను కూడా అందించారు.ఈ సందర్భంగా జిల్లా ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రతి రైతు తమ పశువులకు లింగనిర్ధారణ వీర్వము కేవలం పడ్డ దూడలకు మాత్రమే పుట్టే సెమన్ ని వేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలోఉలవపాడు ఏడీఈ డా: జీ.సురేష్ మరియు భీమవరం డా: నజ్మ మరియు కరేడు డా:శ్రీసాయి, స్థానిక నాయకులు ఎల్. నరేష్ వర్మ, కె.ఆదినారాయుడు, డీ.నరశింహరావు, గొల్లపూడి సత్యం, వై.నతానీలు, పొట్టేళ్ల వెంకటస్వామి, రైతుసేవాకేంద్రం ఏ.హెచ్.ఏ మనోహర్, మౌలాలి, రమేష్ మరియు పశుసంవర్ధక శాఖ సిబ్బంది, స్థానిక రైతులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular