ePaper
Wednesday, March 25, 2026
spot_img
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజువేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి పనులు

వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి పనులు

📰 Generate e-Paper Clip

వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి పనులు 

హుకుంపేట సర్పంచ్ సమిడ వెంకట పూర్ణిమ

హుకుంపేట, పెన్ పవర్,మార్చి 24:రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు సర్పంచ్ సమిడ వెంకట పూర్ణిమ తెలిపారు.పంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులతో పలు ప్రాంతాల్లో బోర్లు మరమ్మతులు, పైప్‌లైన్ రిపేర్ పనులు చేపట్టడంతో పాటు అవసరమైన చోట్ల కొత్త పైప్‌లైన్‌లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

వేసవిలో నీటి కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని సర్పంచ్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular