పోలవరం జిల్లా క్రైమ్ -రంపచోడవరం
వైసిపి నాయకుడి పై దాడి కేసులో పరారీలో ఉన్న నిందితుడికి స్టేషన్ బెయిల్ నలుగురు నిందితులపై రౌడీ షీట్ లేకుండా చేసేందుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రాజువొమ్మంగి ఎస్సై ఉదాంతం. మండలానికి చెందిన వైసిపి నాయకుడు దాట్ల వెంకటరాజు పై ఇటీవల నలుగురు యువకులు దాడి చేసి తీవ్ర గాయాలు పాలు చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు ఒక నిందితుడు పరారీలో ఉండగా అతనిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు ఈ నేపథ్యంలో అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చే నిమిత్తం అలాగే రౌడీ షీట్ ఓపెన్ చేయకుండా ఉండేందుకు గాను ఎస్ ఐ శివకుమార్ గతంలో 25 వేల రూపాయలను తీసుకోవడం జరిగిందని తిరిగి మరో 15000 ఇవ్వాలని డిమాండ్ చేయడంతో నిందితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో రాజమహేంద్రవరం ఎసిబి డిఎస్పి డాక్టర్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం మండలంలోని కిండ్ర జంక్షన్ వద్ద నిందితుల నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు సతీష్ ,భాస్కర్ ,వాసు, కృష్ణ తదితరులు ఉన్నారు.



