ePaper
Monday, May 11, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుపదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన ఆర్‌వీ నగర్ శాంతి సాధన పాఠశాల విద్యార్థులు

పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన ఆర్‌వీ నగర్ శాంతి సాధన పాఠశాల విద్యార్థులు

📰 Generate e-Paper Clip

 మండల తొలి మూడు స్థానాలు ఈ పాఠశాలకే

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 30:అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం ఆర్‌వీ నగర్ శాంతి సాధన ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సత్తా చాటారు.ఈ పాఠశాల నుంచి పదో తరగతి పరీక్షలకు మొత్తం 31 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 27 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో నలుగురు విద్యార్థులు మండల టాపర్లుగా నిలవడం విశేషం. పూజారి దారా స్మైలీ 570 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. 562 మార్కులతో లక్కోజు రోహిత్ ద్వితీయ స్థానం సాధించగా, 537 మార్కులతో కళ్యాణ్ మరియు కార్తికేయ తృతీయ స్థానంలో నిలిచారు.మండలంలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు చేయడంతో పాటు, టాపర్ స్థానాలను సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular