ePaper
Thursday, April 30, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడబందనపూడిలో గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం

బందనపూడిలో గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం

📰 Generate e-Paper Clip


కాజులూరు, ఏప్రిల్ 7, పెన్ పవర్:
కాజులూరు మండల పరిధిలోని బందనపూడి గ్రామంలో టీడీపీ గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు.గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మోకన సత్యం, వైఎస్ ప్రెసిడెంట్‌గా తలాటం సత్తిరాజు సహా ఇతర సభ్యులను నియమించారు. మండల టీడీపీ అధ్యక్షుడు చవాకుల డాక్టర్ బాబు ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా మోకన సత్యం మాట్లాడుతూ గత కొన్ని సంవత్స రాలుగా బూత్ స్థాయిలో పార్టీకి చేసిన సేవలను గుర్తించి అధ్యక్ష పదవి ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో సలాది సాయిబాబు, జక్కన రాజేష్, మోకన వాడపల్లి, మోకన ఈశ్వరరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular