ePaper
Thursday, May 21, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్మృత్యుపాశంగా పసుమర్రు మలుపు

మృత్యుపాశంగా పసుమర్రు మలుపు

📰 Generate e-Paper Clip

తహసీల్దార్ కారు ఢీకొని వ్యక్తి మృతి

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 04: 

చిలకలూరిపేట : మండలంలోని పసుమర్రు గ్రామ సమీప మలుపు వద్ద శనివారం ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన పర్చూరు తహసీల్దార్ కారు, బైక్‌ను బలంగా ఢీకొనడంతో పసుమర్రుకు చెందిన మైల సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందారు. వారం వ్యవధిలోనే ఇదే మలుపు వద్ద ఇది మూడో ప్రమాదం కావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్లే ఈ ‘డెత్ జోన్’లో ప్రాణాలు పోతున్నాయని, వెంటనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular