కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 3: కాజులూరు మండల పరిధిలోని గొల్లపాలెం, ఆర్యవటం,పెనుమళ్ళ, మంజేరు, కుయ్యేరు, కాజులూరు గ్రామపంచాయతీలకు శుక్రవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) జె. రాంబాబు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఉదయం గొల్లపాలెం గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు పంచాయతీ కార్యదర్శి సిహెచ్ సూర్య ప్రకాశరావు, గ్రేడ్-5 కార్యదర్శి భాగ్యవతి పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అలాగే పంచాయతీ సిబ్బంది సమీర్ శర్మ, వీఆర్వోలు ఎస్. శ్రావణి, శ్రీనివాస్, తాతారావు లు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం శలపాక నీటి సంఘం అధ్యక్షులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త తాడి రామారెడ్డి, సొసైటీ అధ్యక్షులు అంగర కృష్ణ, పంచాయతీ సిబ్బంది పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలియజేశారు.తదుపరి ఎంపీడీవో జె. రాంబాబు ఆర్యవటం,పెనుమళ్ళ, మంజేరు, కాజులూరు, కుయ్యేరు గ్రామపంచాయతీలలో కూడా ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా మంజేరు సర్పంచ్ గుంటూరి అప్పారావు,మండల బీజేపీ అధ్యక్షులు పుణ్యమంతుల శివాజీ, పుణ్య మంతుల రామకృష్ణ, గండి బాబ్జీ,తదితరులు ఎంపీడీవోకు స్వాగతం పలికి సాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అంగర శ్రీను,తోట కృష్ణ,కోకా హరి,సుబ్బా రావు,నక్కా శ్రీను,ఆర్టోస్ చిన్న, చిన్నా డాక్టర్, పోతుల వీరబాబు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

