లబ్ధిదారులకు అండగా కూటమి ప్రభుత్వం
కాజులూరు,ఏప్రిల్ 01 పెన్ పవర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కాజులూరు మండలంలోని గొల్లపాలెం గ్రామంలో పండుగ వాతావరణంలో జరిగింది.బుధవారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి (డాక్టర్ బాబు) సంయుక్త ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.అలాగే పంచాయతీ కార్యదర్శి సీహెచ్ సూర్యప్రకాశ్, సచివాలయ సిబ్బంది సహకారంతో మండల మహిళా విభాగ అధ్యక్షురాలు బొమ్మడి సోమాలమ్మ చేతుల మీదుగా పలువురు వృద్ధ మహిళలకు ఇంటింటా పెన్షన్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో చుండ్రు వీర్రాజు చౌదరి,కోట తాతబ్బాయి, వల్లు అర్జున్, మాత నాగబాబు, మేడిశెట్టి పెద్ద, ఎంపీటీసీ కొప్పన లక్ష్మీ,పలివెల రాజు, కొప్పిశెట్టి లక్ష్మీనారాయణ, నక్కా శ్రీను, వనం వీరబ్రహ్మం, రెడ్డి శేషగిరిరావు, సలాది సాయిబాబు, కొల్లి హనుమంతు చౌదరి, ఖండవల్లి శ్రీనివాసరావు, అత్తిలి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.గ్రామంలోని వితంతువులు, వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీడీపీ సీనియర్ నాయకులు పలు గ్రామాల్లో పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా సమాజంలో నిస్సహాయులకు గౌరవాన్ని కల్పిస్తున్నాయని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో సామాజిక పెన్షన్ దారులకు మరింత ఆదరణ లభిస్తోందని,ప్రతి కుటుంబానికి ఆయన ఒక పెద్దన్నగా నిలుస్తున్నారని కొనియాడారు.ఈ పథకం ద్వారా పేద ప్రజల్లో నమ్మకం, ధైర్యం పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

