ePaper
Thursday, April 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడఒంటితాడి గ్రామ పంచాయతీలో పాలకవర్గానికి ఘన సన్మానం

ఒంటితాడి గ్రామ పంచాయతీలో పాలకవర్గానికి ఘన సన్మానం

కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 2:
కాజులూరు మండలం ఒంటితాడి గ్రామ పంచాయతీలో సర్పంచ్ నెల్లి బ్రహ్మాజీ ఆధ్వర్యంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అంగడి అన్నపూర్ణ, ఉప సర్పంచ్ జల్లి వరలక్ష్మి, పోతుల సాయికుమారి, పార్చర్ల లక్ష్మి, ముడికి చిన్నారి, నాగబత్తుల దుర్గాప్రసాద్, పువ్వల భైరవమూర్తి, కొల్లు లోవరాజు (శ్రీను) తదితరులు పాల్గొన్నారు. అలాగే పంచాయతీ కార్యదర్శి శృతి, అన్ని పార్టీల కార్యకర్తలు, నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ నెల్లి బ్రహ్మాజీ మాట్లాడుతూ, ఒంటితాడి మరియు శ్రీలలంక గ్రామాలలో 2021–26 కాలంలో గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు తీసుకున్న చర్యలను వివరించారు. గ్రామ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు సర్పంచ్ నెల్లి బ్రహ్మాజీని ప్రత్యేకంగా సన్మానించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular