ePaper
Thursday, April 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంకారును బలంగా ఢీకొట్టిన మోటార్ సైకిల్...

కారును బలంగా ఢీకొట్టిన మోటార్ సైకిల్…

📰 Generate e-Paper Clip

 

అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్ 01: అడ్డతీగల పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకుని బయటికి వేగంగా వస్తున్న పల్సర్ బైకు ఎన్. హెచ్ 516 రహదారిపై వస్తున్న కారును పల్సర్ బైక్  ఢీకొట్టింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు బలంగా గాయాలయ్యాయి, పల్సర్ బైక్ పై వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడు. వివరాల్లోకి వెళితే జీలుగుమల్లి నుండి రాజవొమ్మంగి వస్తున్న ఏపీ ఆర్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న టి. సునీత56 ఆమె భర్త రాజేశ్వరరావు57 డ్రైవర్ కో డమంచిలి. చిరంజీవి 48 కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పల్సర్ బైక్ కు చెందిన వ్యక్తి కేల .దామోదర్29 అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మఠం భీమవరం కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అటుగా వస్తున్న వారు108 కి సమాచారం అందిన వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను అడ్డతీగల ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. పల్సర్ బైక్ కి చెందిన లాకే .దామోదర్ పరిస్థితి కొంచెం ఆందోళన కరంగా ఉండడంతో, వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇతని ఆధార్ కార్డు అందుబాటులో ఉండటంతో ఇతనికి సంబంధించిన వారికి సమాచారం అందించడం కోసం ప్రయత్నిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular