అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి
గంగవరం, పెన్ పవర్ ,ఏప్రిల్ 1:
గుప్త నిధుల వేట క్షుద్ర పూజలు వంటి మూఢనమ్మకాలు ప్రచారాల పట్ల ప్రజలు అపోహలకు గురికా వద్దని అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి సూచించారు. బుధవారం మండలంలోని ఈ రామవరం లో గంగవరం ఎస్ఐ వెంకయ్య అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా గ్రామంలో గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు నిర్వహించారు అంటూ ప్రజలు గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో సర్పంచ్ రామలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని పోలీసులకు అప్పగించిన నేపథ్యంలో మూఢనమ్మకాలపై ప్రజలను చైతన్యపరిచేందుకుగాను అవగాహన సదస్సు నిర్వహించారు. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న నేటి సమాజంలో ఇంకా గుప్త నిధులు వేట క్షుద్ర పూజలు వంటి మూఢనమ్మకాలను నమ్మవద్దని కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నిస్తారని అటువంటి ప్రచారాలను నమ్మవద్దన్నారు.
మూఢనమ్మకాల వల్ల వ్యక్తిగతంగా, సామాజికంగా కలిగే నష్టాలను వివరించి ప్రజలను అప్రమత్తం చేశారు.అదేవిధంగా గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం, రవాణా వల్ల కలిగే ప్రమాదాలను వివరించి, యువత వాటికి దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పిస్తూ, అనుమానాస్పద కాల్స్, మెసేజులు, లింకులు వస్తే స్పందించవద్దని, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.బాల్య వివాహాల నివారణపై ప్రత్యేకంగా చర్చిస్తూ, చట్టపరమైన చర్యల గురించి వివరించారు. చిన్నారుల భవిష్యత్తు కోసం బాల్య వివాహాలను పూర్తిగా నిరోధించాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామలక్ష్మి, గంగవరం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

