గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 8:అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలం వంచుల పంచాయితీ పరిధిలోని చామగడ్డ గ్రామంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోత్తూరు కొండలరావు పరిశీలించారు. ట్రైబల్ వెల్ఫేర్ డి.ఈ.ఈ రఘునాధ రావు నాయుడుతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారులకు సూచించారు. ఈ బ్రిడ్జి పూర్తయితే చామగడ్డ నుంచి అమ్మవారి దారకొండ పంచాయతీలకు వెళ్లే ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఏ.ఈ.ఈ యాదకిషోర్, తెలుగుదేశం పార్టీ నాయకులు ముర్ల కోటేశ్వరరావు, గాబ్రియేలు, గ్రామస్తులు లక్ష్మణరావు, వర్క్ ఇన్స్పెక్టర్ పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

