గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 10:అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలం వంచుల పంచాయతీ చామగెడ్డ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో “మన ఊరు–మన జెండా” కార్యక్రమం నిర్వహించారు. చల్లంగి అచ్యుత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 30 మంది గిరిజనులు బీజేపీలో చేరారు. వారికి నాయకులు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతకుమారి, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పాంగి రాజారావు, రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ కృష్ణారావు గూడెం కొత్త వీధి బిజెపి మండల అధ్యక్షులు కాకూరు శేఖర్,గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి సరభ వేమన బాబు. చల్లంగి అత్యుత్. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కేజీయరాణి. జిల్లా వైస్ ప్రెసిడెంట్ జీకే వీధి ఎంపీటీసీ రీమల రాజేశ్వరి. బిజెపి సీనియర్ నాయకులు బోండ్ల చిరంజీవి జిల్లా గిరిజన మోర్చా కార్యదర్శి ముట్టడం లక్ష్మణ్. జిల్లా యువ మోర్చా కార్యదర్శి లకే ప్రసాద్. కోపూరి కొత్తయ్య,పోత్తూరు వెంకట్రావు అలాగే గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చామగెడ్డ గ్రామంలో మన ఊరు–మన జెండా కార్యక్రమం నిర్వహణ
RELATED ARTICLES

