ePaper
Saturday, April 4, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడతణుకువాడలో ఘనంగా గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం

తణుకువాడలో ఘనంగా గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం

కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 3: మండల పరిధిలోని తణుకువాడ గ్రామంలో శుక్రవారం నూతన గ్రామ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా వనుం బాలకృష్ణ, ఉపాధ్యక్షుడిగా చెల్లుబోయిన అప్పారావు, ప్రధాన కార్యదర్శిగా కాళా శ్రీను బాధ్యతలు స్వీకరించారు.అలాగే కమిటీకి చెందిన ఇతర సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు చవ్వాకుల డాక్టర్ బాబు మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో మంచి మనసున్న నాయకుడు, అభివృద్ధి ప్రదాతగా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు.
తణుకువాడతో పాటు గొల్లపాలెం, ఆర్యవటం, తిప్పరాజుపాలెం తదితర గ్రామాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు నిర్మాణం చేపట్టిన ఘనత మంత్రి సుభాష్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా తణుకువాడ గ్రామం నుంచే ప్రచారం ప్రారంభించడం ప్రత్యేకతగా నిలుస్తుందని, మంత్రి సుభాష్ కూడా తన ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడ నుంచే ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు.అలాగే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వాసంశెట్టి సుభాష్‌కు తణుకువాడ గ్రామం అధిక మెజార్టీ ఓట్లు అందించిన గ్రామాల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు.ఈ కార్యక్రమానికి మండల కమిటీ అధ్యక్షులు చావ్వాకుల డాక్టర్ బాబు, క్లస్టర్ ఇంచార్జ్ పలివెల రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వల్లు దాక్షాయణి అర్జున్ రావు, సొసైటీ అధ్యక్షులు పితాని సతీష్ కుమార్ తదితరులు హాజరై అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం కొత్త కమిటీ సమిష్టిగా కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular