ePaper
Thursday, April 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పంచాయితీ రాజ్ శాఖకు అవార్డుల పంట

పంచాయితీ రాజ్ శాఖకు అవార్డుల పంట

📰 Generate e-Paper Clip

  • రెండు విభాగాల్లో దేశంలోనే తొలి స్థానం దక్కించుకున్న ఏపీ పంచాయతీరాజ్ శాఖ
  • 24వ స్థానం నుంచి నంబర్-1కు.. పవన్ శాఖలో భారీ జంప్
  • గ్రామ స్వరాజ్, జల్ సంచయ్‌లో జాతీయ స్థాయిలో ఏపీ సత్తా
  • పల్లెపండుగ, పల్లెవెలుగు కార్యక్రమాల ఫలితమే అవార్డుల వర్షం
  • గ్రామసభల నుంచి మౌలిక వసతుల దాకా పవన్ ప్రత్యేక ఫోకస్

నెల్లూరు, పెన్ పవర్ ఏప్రిల్ 1:

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తు్న్న పంచాయతీరాజ్ శాఖకు జాతీయ స్థాయిలో అవార్డులు వరించాయి. రెండు విభాగాల్లో తొలిస్థానంలో నిలిచిన ఏపీ పంచాయతీరాజ్ శాఖ.. ఓ విభాగంలో రెండో స్థానంలో.. మరో రెండు విభాగాల్లో తృతీయ స్థానంలో నిలిచి అవార్డులు గెలుచుకుంది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, జల్ సంచయ్ -జన్ భాగీదారీ విభాగాల్లో తొలిస్థానంలో నిలిచింది. మొత్తంగా గతంలో 24వ ప్లేసులో ఏపీ పంచాయతీరాజ్ శాఖ .. నేడు దేశంలోనే తొలి స్థానంలో నిలిచిందిడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ పంచాయతీరాజ్ శాఖకు జాతీయ స్థాయిలో అవార్డులు పంట పండింది. ఏపీ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో రెండు విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఒక విభాగంలో ద్వితీయ స్థానంలో నిలవగా., మరో రెండు విభాగాల్లో మూడో స్థానంలో నిలిచి అవార్డులు గెలుచుకుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, వివిధ సేవల్లో మెరుగైన పనితీరు ఆధారంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది.రాష్ట్రీయ గ్రామస్వరాజ్‌ అభియాన్‌, జల్‌ సంచయ్‌-జన్‌ భాగీదారి విభాగంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. గత ప్రభుత్వం హయాంలో 24వ స్థానంలో నిలిచిన ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ.. ఈసారి దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం విశేషం. గ్రామ పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించేలా చేయటం, అలాగే ప్రణాళికబద్ధమైన అభివృద్ధి కోసం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. అలాగే జల్ సంచయ్ – జన్ భాగీదారీ కార్యక్రమం కింద తక్కువ ఖర్చుతో వర్షపు నీటిని నిల్వచేసే పద్ధతులను ప్రోత్సహిస్తారు. ఈ రెండు విభాగాల్లో దేశంలోనే తొలి స్థానంలో ఏపీ పంచాయతీరాజ్ శాఖ నిలిచింది.మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐదు మంత్రిత్వ శాఖల బాధ్యతలు చూస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ శాఖ, శాస్త్ర సాంకేతికత శాఖలను పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలను పవన్ కళ్యాణ్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా పల్లెపండుగ 1.0, పల్లెపండుగ 2.0 కార్యక్రమాలు చేపట్టారు.అలాగే ఒకేసారి రికార్డు స్థాయిలో గ్రామసభలు నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. గ్రామసభలలో వచ్చిన వినతుల ఆధారంగా పల్లెవెలుగు కార్యక్రమాలు చేపట్టి రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ అవార్డులు కైవసం చేసుకోవటం విశేషం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular