కాజులూరు, ఏప్రిల్ 9: గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు కీలకమని చాటి చెప్పే విధంగా కాజులూరు మండలంలో గురువారం ఎన్రోల్మెంట్ డ్రైవ్‌ను ఘనంగా నిర్వహించారు. ఎంఈఓ-1 ఎంఈఓ-2 సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
కాజులూరు క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు మార్ని విష్ణుమూర్తి,ఎంపీ ఎస్ హెడ్‌మాస్టర్ దుర్గారావు, మండల ఏవో పద్మలత,ఎంఈఓ-1 దాసరిపల్లె డేవిడ్,ఎంఈఓ-2 పి. జాన్ తదితరులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరించారు. “ప్రభుత్వ బడుల్లో చదువులు మీ పిల్లల జీవితానికి వెలుగులు – గ్రామాల్లో పాఠశాలలు దేశానికి పట్టు కొమ్మలు” అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్య,నాణ్యమైన బోధన,మౌలిక సదుపాయాలు,మధ్యాహ్న భోజనం,యూనిఫామ్‌లు, పుస్తకాలు వంటి సౌకర్యాలను వివరించారు.తల్లిదండ్రులు తమ పిల్లలను సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వ పాఠశాలలు సమాజ నిర్మాణానికి బలమైన పునాది అని,విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

