యూటిఎఫ్ పిలుపుతో గంగవరం మండలంలో 15 నుంచి ప్రారంభం
గంగవరం, పెన్ పవర్ ఏప్రిల్ 10: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటిఎఫ్) ఆధ్వర్యంలో “మన ఊరి బడి – మనం కాపాడుకుందాం” అనే ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని గంగవరం మండలంలో ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు యూటిఎఫ్ మండల అధ్యక్షుడు బొజ్జిదొర, ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను కలుసుకుని, ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యత, ఉపాధ్యాయుల నైపుణ్యం, విద్యా ప్రమాణాల గురించి వివరించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండలంలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యావేత్తలు, ప్రముఖులు చురుకుగా పాల్గొని ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షుడు రాంబాబు దొర, మహిళా అధ్యక్షురాలు రుక్మిణి దేవి, కోశాధికారి సత్య కిరణ్ రెడ్డి, కార్యదర్శులు కారం రాంబాబు, కుసుమ కుమారి, జిల్లా కౌన్సిలర్లు వెంకటేశ్వరరావు, వంశీ ప్రియా తదితరులు పాల్గొన్నారు.

