ePaper
Monday, April 6, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడమండలంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

మండలంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 6:
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కాజులూరు మండలంలో పలు గ్రామాల్లో కార్యకర్తలు పండుగవాతావరణంలోఘనంగా నిర్వహించారు.మండల బీజేపీ అధ్యక్షుడు పుణ్యమంతుల శివాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాలకు జిల్లా ప్రధాన కార్యదర్శి, “మన ఊరు మన జెండా” జిల్లా కో-కన్వీనర్ సలాది వీరబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జనసంఘ్ నుండి ప్రారంభమైన బీజేపీ ప్రయాణం 1980లో అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో బలమైన పార్టీగా అవతరించిందని తెలిపారు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ “వికసిత భారత్ 2047” లక్ష్యంతో దూసుకెళ్తుందని పేర్కొన్నారు.“దేశం ఫస్ట్ – పార్టీ నెక్స్ట్ – సెల్ఫ్ లాస్ట్” అనే సిద్ధాంతంతో ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పని చేయడం వల్లే పార్టీ ఈ స్థాయికి చేరుకుందని అన్నారు. రాబోయే రోజుల్లో కాజులూరు మండల ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వాలని నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నిమ్మన రాజేష్, వాసంశెట్టి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి బండారు సత్యనారాయణ,ఉపాధ్యక్షులు పోలిశెట్టి శ్రీనివాస్, దేవు పట్టాభి, ఇతర నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular