ePaper
Sunday, April 12, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుమండల కేంద్రాల్లో ప్రతి సోమవారం ‘గ్రీవెన్స్ డే’ తప్పనిసరి:జిల్లా కలెక్టర్ నిశాంతి

మండల కేంద్రాల్లో ప్రతి సోమవారం ‘గ్రీవెన్స్ డే’ తప్పనిసరి:జిల్లా కలెక్టర్ నిశాంతి

అధికారులందరూ హాజరు కావాలి

స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్, ఏప్రిల్ 12: ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో ‘మీ కోసం గ్రీవెన్స్ డే’ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఆదివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ తిరుమని శ్రీపూజ, ఐటిడిఎ పీఓ ఆదిత్య వర్మ, ఆర్డీవో ఎం.వి.ఎస్. లోకేశ్వరరావు, డిఆర్వో నీలకంఠరావు తదితరులతో కలిసి కలెక్టర్ మాట్లాడారు.ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వహణపై పలు కీలక సూచనలు చేశారు.ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేకు తహసీల్దార్లు, ఎంపీడీవోలతో పాటు మండల స్థాయి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. అగ్రికల్చర్, ఇంజనీరింగ్, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్, ట్రైబల్ వెల్ఫేర్, ఐసిడిఎస్, హౌసింగ్, డీఆర్డీఏ వంటి శాఖల అధికారులు పాల్గొనాలని స్పష్టం చేశారు. గ్రీవెన్స్ కార్యక్రమం సక్రమంగా జరుగుతుందో లేదో జాయింట్ కలెక్టర్ పర్యవేక్షించాలని, డిఆర్వో సహకరించాలని తెలిపారు. ప్రతి మండలంలో హాజరైన, గైర్హాజరైన అధికారుల వివరాలతో అటెండెన్స్ నివేదికను వెంటనే కలెక్టరేట్‌కు పంపాలని ఆదేశించారు.ప్రజల నుంచి వచ్చే వినతులను సంబంధిత శాఖల లాగిన్‌లలో నమోదు చేసి, వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అధికారులందరూ నవోత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఇక గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించాలని, ఎంపీడీవోలు, తహసీల్దార్లు టామ్‌టామ్ ద్వారా ప్రజలకు సమాచారం చేరవేయాలని ఆదేశించారు.ఈ ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా స్థాయి అధికారులు, మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular