- పవర్ లూమ్స్ కు నెలకు 500 యూనిట్లు.
- హ్యండ్ లూమ్స్ కు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై నేతన్నల్లో హర్షాతిరేకాలు.
చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 01:
చిలకలూరిపేట : నేతన్నల జీవితాల్లో కూటమి ప్రభుత్వం కొత్త వెలుగులు నింపిందని, హ్యాండ్ లూమ్స్ కు (చేతి మగ్గాలు) నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ (మరమగ్గాలు) కు నెలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్న యువగళం హామీని మంత్రి నారా లోకేశ్ నెరవేర్చాడని, ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1.05 లక్షల చేనేత కుటుంబాలకు లబ్ధి కలగనుందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.
చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ, స్థానిక నేతన్నలు బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో ప్రత్తిపాటి మాట్లాడారు.
ఆర్థిక భారం తగ్గడంతో పాటు.. సాంప్రదాయ చేనేతకు ఊతం
చంద్రబాబు నాయకత్వంలోని కూటమిప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంతో చేనేత కార్మికులకు ఆర్థిక భారం తగ్గుతుందని ప్రత్తిపాటి చెప్పారు. నెలకు 200 యూనిట్లు, 500 యూనిట్ల ఉచిత విద్యుత్ వ్యయం తగ్గినందున కార్మికులు పనితీరు మెరుగుపడుతుందన్నారు. ముఖ్యంగా సాంప్రదాయ చేనేత వర్గాలకు ఈ నిర్ణయం ఊతంగా నిలుస్తుందన్నారు.
నేతన్నల సంక్షేమమే కూటమిప్రభుత్వ లక్ష్యం..
నియోజకవర్గంలో చేతి మగ్గాలు 93 వేలుంటే, పవర్ లూమ్స్ 11,458 వరకు ఉన్నాయని, చేతి మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను ప్రభుత్వం అందిస్తోందన్నారు. నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా కూటమిప్రభుత్వం వారికి రాయితీపై రుణాలు, యాంత్రీకరణ పరికరాలను కూడా సమకూరుస్తోందన్నారు. ఉచిత విద్యుత్ పొందడానికి అర్హత ఉన్న నేతన్నలు తమ వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ప్రయోజనాలు పొందవచ్చని ప్రత్తిపాటి సూచించారు. మగ్గాలకు ఉచిత విద్యుత్ అందించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై నేతకుటుంబాల్లో హార్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్,పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర నాయకులు ఇనగంటి జగదీష్, క్లస్టర్ ఇంచార్జీలు మద్దిబోయిన శివ, గంజి శ్రీనివాసరావు, బేరింగ్ మౌలాలి, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి బాబు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, టీడీపీ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

