ePaper
Friday, April 10, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంమహామనుల విగ్రహాల ఆవిష్కరణకు జయప్రదం చేయండి

మహామనుల విగ్రహాల ఆవిష్కరణకు జయప్రదం చేయండి

కూర్మన్నపాలెం :పెన్ పవర్ ,ఏప్రిల్ 10
మహాత్మా జ్యోతిరావు పూలే,బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ల జయంతి సందర్భంగా కూర్మన్నపాలెం కూడలిలో ముగ్గురు మార్గదర్శకుల విగ్రహాలు ఆవిష్కరించినట్లు పూలే -అంబేద్కర్ విజ్ఞాన్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ కేబీఆర్ అంబేద్కర్ తెలిపారు.  కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ మాట్లాడుతూ ఏప్రిల్  11న సావిత్రిబాయి పూలే, రామా బాయ్ అంబేద్కర్, ఫాతిమా షేక్ ల విగ్రహాలను ఏర్పాటు చేసి ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు . కార్యక్రమానికి విశాఖపట్నం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, , రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , గాజువాక శాసనసభ్యుడు  పల్లా శ్రీనివాసరావు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారని , ప్రతి ఒక్కరి కార్యక్రమాన్ని వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు గుంజా చింతయ్య, జవహర్ నాథ్, కాకర్ల మాడి బోస్, పోతల కృష్ణ,శ్రీను బాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular