నిందితుడి అరెస్ట్, 230 గ్రాముల సొత్తు స్వాధీనం…
చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 01:
యడ్లపాడు: భక్తితో నమ్మకంగా కొలిచే ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన వెండి,బంగారు ఆభరణాల దొంగతనంతో సంబంధం ఉన్న కేసులో ఎడ్లపాడు ఎస్సై శివరామకృష్ణ మరియు సిబ్బంది ఓ నిందితుడిని అరెస్ట్ చేసి 230 గ్రాముల వెండి‑బంగారు సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడి అరెస్ట్ వివరాలు..
యడ్లపాడు గ్రామానికి చెందిన 43 ఏళ్ల మద్దుల రమణారావు (తండ్రి: మద్దుల హనుమంతరావు)ను తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న బజారు ప్రాంతంలో 2026, మార్చి 31వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.అతనిపై యడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నెం. 17/2026 కింద యు/ఎస్ 303(2), 305(డి), 306 బి ఎన్ ఎస్ సెక్షన్లతో పాటుగా దర్యాప్తు కొనసాగించండంతో ఆయన అదుపులోకి తీసుకున్నారు.ఆభరణాల దాచిన స్థలం,స్వాధీనం అరెస్ట్ అనంతరం తన వాంగ్మూలంలో నిందితుడు దొంగిలించిన ఆస్తులను కనమర్లపూడిలోని శ్రీహరిరావు ఇంటి వద్ద దాచినట్లు తెలిపాడు. దీనిమేరకు దర్యాప్తు అధికారి మధ్యవర్తుల సమక్షంలో సంబంధిత ప్రదేశానికి చేరుకుని ఆభరణాలను సీజ్ చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న ఆభరణాలన్నీ యడ్లపాడు ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన చోరీ సొత్తే అని అధికారులు గుర్తించారు.
స్వాధీనమైన ఆభరణాల వివరాలుసీజ్..
వెండి వస్తువులు (మొత్తం 216 గ్రాములు)తమలపాకుల తోరణం – 142 గ్రాములునామాలు మరియు నేత్రాలు – 42 గ్రాములురెండు జతల ఉత్తర జంద్యాలు – 14 గ్రాములుమెట్టెలు మరియు పిల్లేళ్లు – 20 గ్రాములుబంగారు ఆభరణాలు (మొత్తం 14 గ్రాములు)మంగళసూత్రం – 4 గ్రాములురెండు జతల బంగారు నేత్రాలు – 10 గ్రాములుపై ఆస్తులను ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో గుర్తించి, తదుపరి దర్యాప్తు కోసం పోలీసులు సీజ్ చేశారు. నిందితుడు మద్దుల రమణారావును అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ కు తరలించి,కేసులో ఇతర అంశాలు, మధ్యవర్తి పాత్రలపై కూడా క్లుప్త దర్యాప్తు చేపడుతున్నామని ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు.

