ePaper
Friday, April 10, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్యారాడలో వెల్లువెత్తిన నిరసన'జెట్టీ' వద్దు - 'టూరిజం' ముద్దు!

యారాడలో వెల్లువెత్తిన నిరసన’జెట్టీ’ వద్దు – ‘టూరిజం’ ముద్దు!

  • విశాఖ పెన్ పవర్ ఏప్రిల్ 10 :

 

సుమారు 400 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన యారాడ గ్రామం ఇప్పుడు ఒక కీలక పోరాటానికి సిద్ధమవు తోంది. తమ గ్రామంలో ప్రతిపాదించిన చేపల జెట్టీని వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు గళమెత్తారు. పచ్చని పం ట పొలాలు, తరతరాల వ్యవ సాయ సంస్కృతి కలిగి న ఈ ప్రాంతాన్ని ఫిషింగ్ హబ్‌గా మార్చవద్దని, ఆంధ్ర ప్రదేశ్‌కే గర్వకారణం గా నిలిచే టూరిజం ప్రాజె క్టుగా అభివృద్ధి చేయా లని గ్రామస్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యవసాయమే మా జీవనాధారం యారా డ గ్రామంలో సుమారు 5,000 మంది జనాభా కేవలం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ పచ్చని అరటి తోటలు, కొబ్బరి, బొప్పా యి వంటి వాణిజ్య పంటలు సమృద్ధిగా పండుతాయి.

“మా తాత ముత్తాతల కాలం నుండి మేము మ ట్టిని నమ్ముకుని బతుకుతున్నాం. మాది జాలరి వృత్తి కాదు, మేము రైతులం. ఈ విషయం స్థానిక నాయక త్వానికి కూడా తెలుసు. అలాంటప్పుడు మా పంట పొలాలను నాశనం చేస్తూ చేపల జెట్టీని తీసుకురావ డం ఎంతవరకు సమంజసం?” అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పర్యాటక రంగంతోనే ఉజ్వల భవిష్యత్తు

గ్రామ ప్రజల ప్రధాన డిమాండ్ ఒక్కటే—యారాడను ఏపీ టూరిజం కింద అభివృద్ధి చేయడం. గతంలో మాజీ మంత్రి, కీర్తిశేషులు గుడివాడ గురునాధరావు గ్రామానికి వచ్చిన కష్టకాలంలో అండగా నిలబడి అభివృద్ధికి బాట లు వేశారని వారు గుర్తు చేసుకున్నా రు. ఇప్పు డు అదే బాటలో ప్రస్తుత గాజువాక శాసన సభ్యులు చొరవ చూపాలని వారు కోరుతున్నారు. ఎమ్మెల్యేకి గ్రామస్థుల విన్నపం

ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సామా న్యుల మనిషి అని, పిలిస్తే పలికే వ్యక్తిగా పేరుం దని కొనియాడుతూ, తమ సమస్యను అర్థం చేసుకోవాలని వారు కోరుతున్నారు

ప్రధాన డిమాండ్ల ప్రతిపాదిత చేపల జెట్టీ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలి.యారాడ సముద్ర తీరాన్ని అంత ర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చాలి. స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా టూరిజం ప్రాజెక్టులు చేపట్టాలి.”మాపిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, ఈ 400 ఏళ్ల గ్రామం ఉనికి కాపాడబడాలన్నా ఇక్డడ టూరిజం మాత్రమే రావాలి. పచ్చని పొలాలను కాపాడుకుంటూనే అభివృద్ధిని సాధించాలి” అని గ్రామ పెద్దలు స్పష్టం చేశారు. మరి ప్రభు త్వం మరియు స్థానిక యంత్రాంగం యారాడ ప్రజల ఆవేదనను ఎలా పరిగణనలోకి తీసుకుం టారో వేచి చూడాలి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular