ePaper
Thursday, April 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంవేకువ జామునే పెన్షన్లు పంపిణీ..

వేకువ జామునే పెన్షన్లు పంపిణీ..

📰 Generate e-Paper Clip

 

అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్01: మండల కేంద్రమైన అడ్డతీగల లో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో, వేకువ జామున అధికారులు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి లబ్ధిదారుడు వద్దకు వెళ్లి స్వయంగా అడ్డతీగల తాసిల్దార్ దొరకయ్య మరియు ఎంపీడీవో ఏ.వి.వి కుమార్ సమక్షంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి లబ్ధిదారుడికి ఐ.వి.ఆర్.ఎస్ ఫోన్ కాల్ వస్తుందని తాసిల్దార్ దొరకయ్య, ఎంపీడీవో కుమార్ లబ్ధిదారులకు తెలియజేశారు. ఇందులో భాగంగా పెన్షన్లు పంపిణీకి వచ్చిన సిబ్బంది, లబ్ధిదారుల ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారా లేదా వారి ప్రవర్తన మంచిగా ఉందా లేదా,పెన్షన్ పంపిణీ అనంతరం లంచం ఏమైనా అడుగుతున్నారా అన్న సమాచారాన్ని అడుగుతారని, వారి ప్రవర్తన బాగుంది అయితే అయితే 1 నొక్కాలని, వారి ప్రవర్తన బాగుగా లేదు అయితే 2 నొక్కాలని లబ్ధిదారునికి తాసిల్దార్, ఎంపీడీవో తెలియజేశారు.

పెన్షన్ విషయంలో లబ్ధిదారులకు ఇబ్బందులు ఏమైనా కలిగితే, వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని అధికారులు అందుబాటులో ఉంటారని, లబ్ధిదారులకు అధికారులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular