గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 12:జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గూడెం కొత్త వీధి మండలంలో ప్రజల అర్జీల స్వీకరణ కోసం సోమవారం మండల కేంద్రంలో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తహసీల్దార్ హెచ్.అన్నాజీ రావు తెలిపారు. మండలానికి చెందిన ప్రజలు తమ సమస్యలు, వినతిపత్రాలను ఈ కార్యక్రమంలో నేరుగా సమర్పించవచ్చని సూచించారు. పాడేరు కేంద్రానికి వెళ్లి వ్యయప్రయాసలు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమం సందర్భంగా అన్ని శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల అర్జీలను స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపడతారని తెలిపారు.
సమస్యల పరిష్కారానికి మండల కేంద్రంలో సోమవారం ‘మీ కోసం’ కార్యక్రమం
RELATED ARTICLES

