ePaper
Saturday, April 4, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పర్ఫెక్ట్ ప్లాన్ తో పవన్...

పర్ఫెక్ట్ ప్లాన్ తో పవన్…

పంచాయతీ రాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ అమలు చేసిన పర్ఫెక్ట్ ప్లాన్‌కు జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు లభించింది.ఒకప్పుడు 24వ స్థానంలో ఉన్న శాఖ, ఇప్పుడు దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం విశేషం.గ్రామ సభలు, పల్లె పండుగ, గ్రామీణ మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టితో ఏపీకి 5 జాతీయ అవార్డులు దక్కాయి.గుడ్ గవర్నెన్స్ నుంచి ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీల వరకు పలు విభాగాల్లో రాష్ట్రం సత్తా చాటింది.గ్రామీణ పరిపాలనలో ఏపీని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా పవన్ అడుగులు ఫలిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

  • 24వ స్థానం నుంచి దేశంలో నెంబర్-1గా పంచాయతీ రాజ్ శాఖ
  • పల్లె పండుగ, గ్రామ సభలతో పవన్ మాస్టర్ ప్లాన్
  • ఏపీకి 5 జాతీయ పంచాయతీ అవార్డులు
  • శృంగవరం, బొక్కాసం పాలెంకు జాతీయ గుర్తింపు
  • గ్రామీణ గవర్నెన్స్‌లో ఏపీకి కొత్త మోడల్

విజయవాడ | పెన్ పవర్ | ఏప్రిల్ 3:

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని పంచాయతీ రాజ్ శాఖ జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపును సాధించింది. గతంలో 24వ స్థానంలో ఉన్న ఈ శాఖ, గ్రామీణ అభివృద్ధిపై తీసుకున్న ప్రణాళికాబద్ధ చర్యలతో దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. తాజాగా కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఏపీకి 5 ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కడం దీనికి నిదర్శనం.పవన్ కళ్యాణ్ చేపట్టిన గ్రామ సభలు, పల్లె పండుగ, స్థానిక అవసరాలను ప్రజల నుంచే గుర్తించి కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లే విధానం గ్రామీణ పరిపాలనలో పెద్ద మార్పుకు దారి తీసింది. ఈ పద్ధతితో గ్రామాల్లో మౌలిక వసతులు, పారిశుద్యం, నీటి సంరక్షణ, మహిళా సాధికారత రంగాల్లో గణనీయమైన ఫలితాలు కనిపించాయి. అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలోని శృంగవరం పంచాయతీ గుడ్ గవర్నెన్స్ విభాగంలో దేశంలోనే మొదటి స్థానం సాధించగా, తిరుపతి జిల్లా బొక్కాసం పాలెం ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీగా అగ్రస్థానంలో నిలిచింది. అలాగే చెమ్ములపల్లి, గుండుమల పంచాయతీలు, కుప్పం మండలం కూడా వివిధ విభాగాల్లో జాతీయ ర్యాంకులు సాధించాయి.గ్రామీణ గవర్నెన్స్‌ను ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలన్న పవన్ కళ్యాణ్ వ్యూహం ఇప్పుడు ఫలితాల రూపంలో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విజయాలతో ఏపీ పంచాయతీ రాజ్ వ్యవస్థ దేశానికి ఒక మోడల్‌గా నిలుస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular