Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుఏపీ డిగ్రీ అడ్మిషన్లు: 10లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి

ఏపీ డిగ్రీ అడ్మిషన్లు: 10లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి

పాడేరు, పెన్ పవర్, సెప్టెంబర్ 8: ఆంధ్రప్రదేశ్ డిగ్రీ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 10వ తేదీలోగా తమకు కేటాయించిన కళాశాలల్లో తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. సత్యనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ కమిషనరేట్ (APCHE) సెప్టెంబర్ 7న డిగ్రీ అడ్మిషన్ల సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేసిన నేపథ్యంలో, సీట్లు పొందిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు.విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని, జాయిన్ అయిన రోజు నుంచే తరగతులు ప్రారంభమవుతాయని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. సత్యనారాయణ స్పష్టం చేశారు. గడువు ముగిసేలోగా అడ్మిషన్ పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular