Homeఆంధ్రప్రదేశ్తుఫాను వేళ అప్రమత్తంగా ఉండండి.. రాత్రి ప్రయాణాలు వద్దు: సీఐ సుధాకర్

తుఫాను వేళ అప్రమత్తంగా ఉండండి.. రాత్రి ప్రయాణాలు వద్దు: సీఐ సుధాకర్

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, అక్టోబర్ 28: తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీకేవీధి సీఐ సుధాకర్ సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, రాత్రివేళ ప్రయాణాలకు దూరంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.భారీ వర్షాల కారణంగా ఘాట్‌ రోడ్డులో వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు. మంగళవారం రాత్రి సీలేరు జెన్‌కో చెక్‌పోస్టు వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించినట్లు పేర్కొన్నారు. తుఫాను పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికులు పోలీసుల సూచనలు పాటించాలని, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు.ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తమ కుటుంబాల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్ఐ యాసిన్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular