Homeఆంధ్రప్రదేశ్రింతాడలో బీజేపీ అభ్యర్థి పుష్పలక్ష్మి విస్తృత ప్రచారం

రింతాడలో బీజేపీ అభ్యర్థి పుష్పలక్ష్మి విస్తృత ప్రచారం

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 3:మండలంలోని రింతాడ గ్రామంలో బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థి రొబ్బ పుష్పలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను సమన్వయం చేసుకుంటూ మండల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రభాకర్, అరిమెల రాజు శ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular