స్టాఫ్ రిపోర్టర్,చింతపల్లి/ గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్ 26:అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన నవోదయం 2.0 (నాటు సారా పై ఉక్కు పాదం) లో భాగంగా చింతపల్లి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జె కూర్మారావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాటు సారా తయారీ, సేవనం, రవాణా వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు మరియు యువతపై అసాంఘిక ప్రభావం గురించి ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జె.కూర్మారావు,ఎక్సైజ్ సిబ్బంది,ప్రాజెక్ట్ అధికారులు, వైద్య అధికారులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.