1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం:పేసా మండల అధ్యక్షుడు కొర్ర బలరాం 

IMG-20250424-WA1639 గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 24:గిరిజన ప్రాంతంలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయటానికి తహసిల్దార్ కృషి చేయాలని కోరుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండల కేంద్రంలో మండల పీసా అధ్యక్షుడు కొర్ర బలరాం ఆధ్వర్యంలో మండల పేసా కార్యవర్గ సభ్యులు ఎమ్మార్వో కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ సీతారాం కు వినతి పత్రం అందించారు. మండల కేంద్రం మొదలుకొని ఆర్ వి నగర్,రింతాడా,దుచ్చారా పాలెం, పెదవలస,దారకొండ తదితర గ్రామాలలో గిరిజనేతరులు అక్రమ కట్టడాలు నిర్మించుకుంటున్నారని 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలుచేసి వీరిపై చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్ జారీ చేసిన సర్కులర్ ప్రకారం ఆదివాసి ప్రాంతాలలో గ్రామసభలు ఏర్పాటు చేసి ఆదివాసులను చైతన్యం చేయాలని వినతి పత్రంలో కోరారు. అలాగే గ్రామసభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సర్కులర్ జారీ చేసినప్పటికీ తహసిల్దార్ ఇప్పటివరకు మండలంలో ఎక్కడెక్కడ గ్రామసభలు ఏర్పాటు చేశారని , దీనిపై ఏ చర్యలు చేపట్టారు ప్రజలకు వివరించాలని కోరారు. అలాగే జీకే వీధి మండల కేంద్రంలో గిరిజనేతరులు అక్రమ కట్టడాలు నిర్మించుకొని ఉన్నారని, దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.మరియు ప్రభుత్వ భూములు కూడా ఆక్రమణకు గురి అవుతున్నాయని కావున ప్రభుత్వ భూములను గుర్తించి సర్వే చేపట్టాలని కోరారు. మండల కేంద్రంలో గల సర్వే నంబర్ 87 లో గల భూములకు పూర్తి సర్వే జరిపి పేసా చట్టం నిబంధనల ప్రకారం ఆక్రమణకు గురి అయిన స్థలాలను విడిపించి, బాధ్యులపై చర్యలు చేపట్టాలని, ఆ స్థలాలను గిరిజన యువత కు లేదా ప్రభుత్వ బిల్డింగ్ల నిర్మాణానికి ఉపయోగించాలని కోరారు. అలాగే పెదవలస పంచాయతీ చాపరాజుపాలెం, సంకాడ పంచాయతీ జడుమూరు గ్రామాలలో లెట రైట్ తవ్వకాలకు అనుమతులకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది అని, పేసా గ్రామ సభ తీర్మానం లేకుండా ఏ విధంగా అనుమతులు జారీ చేస్తున్నారని, తప్పనిసరిగా పేసా గ్రామసభ అనుమతులు అవసరమని అన్నారు. అలాగే లకవరపేట పంచాయతీ కొడిసింగి గ్రామంలో ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న సూర్యఘర్ సోలార్ పవర్ ప్రాజెక్టుకు కేటాయిస్తున్న భూముల కొరకు కూడా పేసా గ్రామ సభ తీర్మానం చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. మరీ ముఖ్యంగా 1/70 చట్టాన్ని 5వ షెడ్యూల్ ఏరియాలో పటిష్టంగా అమలు చేయటానికి, జిల్లా కలెక్టర్ జారీ చేసిన జీవో ప్రకారం ఆదివాసీలకు చట్టంపై అవగాహన కల్పించడానికి చర్యలు చేపట్టాలని కోరారు. డిప్యూటీ తహసిల్దార్ సీతారాం, ఆర్ఐ మహాదేవులకు పేసా మండల అధ్యక్షులు కొర్ర బలరాం, ప్రధాన కార్యదర్శి మాదిరి చంటిబాబు, పేసా గౌరవ అధ్యక్షులు గొర్లె వీర వెంకట్, కోశాధికారి లకే రామచంద్రుడు వినతి పత్రాన్ని అందించారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement