స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,సెప్టెంబర్ 01:జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నెల 2వ తేది సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలకు,ప్రభుత్వ శెలవు దినముగా ప్రకటిస్తున్నట్లు తెలియజేశారు.ప్రైవేట్ పాఠశాలలు కూడా విధిగా సెలవు ఇవ్వాలని,ఎటువంటి తరగతులు నిర్వహించరాదని తెలిపారు.విద్యార్థుల తల్లిదండ్రులు సెలవును గమనించి పిల్లలను పాఠశాలకు పంపించరాదని సూచించారు.ఎట్టి పరిస్థితులలోనూ పిల్లలు వాగులు గడ్డలు దాటరాదని కలెక్టర్ సూచించారు.