ePaper
Saturday, February 28, 2026
spot_img
ePaper
Homeతెలంగాణమేడ్చల్ మల్కాజ్‌గిరిఅక్రమ అనుమతి పాలిటిక్స్‌లో..! 'వ్యాస' వ్యూహం..!

అక్రమ అనుమతి పాలిటిక్స్‌లో..! ‘వ్యాస’ వ్యూహం..!

Illegal permission in politics..! 'Vyasa' strategy..!

📰 Generate e-Paper Clip

  • పాత నిర్మాణాలకు కొత్త అనుమతులు.. “వాట్ ఏన్ ఐడియా సర్‌జీ”..!
  • అనుమతుల్లేవు..! ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు..! మూడేళ్ళుగా పాఠశాల నిర్వహణ.
  • అయినా అగ్నిమాపక శాఖ ఏ ప్రాతిపదికన ‘ఎన్‌వోసి’ జారీ..?
  • పలుకుబడితో పర్మిషన్‌‌లు..! ముడుపులతో ‘ఎన్‌వోసి’లా..?
  • ఏసీబి దాడులు నిర్వహించినా..! దుండిగల్‌ సర్కిల్‌లో కనిపించని మార్పు..
  • పాత నిర్మాణాలకు కొత్త అనుమతులు.. “వాట్ ఏన్ ఐడియా సర్‌జీ”..!
  • స్థానిక మున్సిపల్ అధికారుల జోక్యం లేకుండా సాధ్యమేనా..?
  • ‘ఆర్ అండ్ బి’ ఎన్‌వోసి జారీపైనా అనుమానాలే..!
  • కన్జర్వేషన్ జోన్‌లోని వ్యవసాయ భూమిని మున్సిపాలిటీకి రాసిస్తే..! సక్రమమేనా..?
  • లేఅవుట్ లేదు..! ప్లాట్‌ నెంబర్‌లు లేవు..! 40 ఫీట్ల రోడ్లు అంతకన్నా లేవు..!
  • ఖాళీ ప్లాట్‌లకి మాత్రమే అనుమతుల మంజూరు.. నిబంధనలు మరిచారా..?
  • 2022 నుంచి అనుమతుల్లేని వ్యాసా పాఠశాల అక్రమ కట్టడాలపై చర్యలేవి..?

  • దుండిగల్‌ ‘సిఎంసి’ పరిధిలో తప్పుడు పర్మిషన్‌‌లపై విమర్శలు..
  • ఒక్కో శాఖ ఒక్కో విధంగా బౌరంపేట్ వ్యాసా పాఠశాలకు సహకారం బట్టబయలు..
  • హెచ్ఎండిఏ ప్రకటించిన కన్జర్వేషన్ జోన్‌కు దుండిగల్‌ తహశీల్దార్ నాలా కన్వర్శన్‌లు..
  • 2021-2022లోనే గుట్టు చప్పుడు కాకుండా ఈ నాలా కన్వర్శన్ వ్యవహారం..
  • సింగిల్ విండో అంటేనే..! తప్పుడు పర్మిషన్‌‌ లకు కేరాఫ్ అడ్రస్‌గా భావించాలా..?
  • అటు హెచ్ఎండిఏ ప్లానింగ్ అధికారులు అవగాహనా రాహిత్యంతో పర్మిషన్‌ జారీ..
  • ఆ అనుమతులు మేము ఇవ్వలేదంటున్న దుండిగల్‌ సర్కిల్ టౌన్‌ప్లానింగ్..
  • హెచ్ఎండిఏ ను ప్రశ్నించమని ఏసిపి ఉచిత సలహా సరే..! సారు విధులు ఎందుకో మరి..?

హెచ్ఎండిఏ ప్రకటించిన కన్జర్వేషన్ జోన్‌ స్థలానికి..! రెవెన్యూ అధికారులు బాధ్యతా రహితంగా చేసిన నాలా కన్వర్శన్‌లు వివాదాస్పదంగా తయారైంది.. అటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం.. హెచ్ఎండిఏ గుడ్డిగా అనుమతుల మంజూరు..! తోడుగా వివిధ శాఖలు తప్పుడు ‘ఎన్‌వోసి’లు జారీ..! ఈ మొత్తం వ్యవహారంలో రూ.లక్షల్లో చేతులు మారితేనే ఇంతటి ఘనకార్యం సవ్యంగా కొనసాగే అవకాశం ఉందని పలువురి ఆరోపణ.. ఏ ఆధారాలు లేకుండానే ఒక కార్పోరేట్ పాఠశాలకు అధికార యంత్రాంగం ఏ మేరకు సహకరించారో స్పష్టమవుతుంది.. పలుకుబడికి విధులు తాకట్టు పెట్టారని తేటతెల్లం చేస్తోంది.. సిఫార్సులకు ప్రాధాన్యత ఇస్తూ, బౌరంపేట్ ‘వ్యాసా పాఠశాల యాజమాన్యానికి అధికార యంత్రాంగం దాసోహం అయిందని ఆధారాలు బట్టబయలు అయ్యాయి..! ‘పాత అక్రమ కట్టడాలకు’ మూడేళ్ళ అనంతరం కొత్తగా అనుమతులు మంజూరు చేసిన “దుండిగల్‌ సర్కిల్- హెచ్ఎండిఏ”ను ప్రశంసించలేక ఉండలేం.. అధికార యంత్రాంగం తప్పుడు వ్యవహారాన్ని “హెచ్ఎండిఏ సహా సంబంధిత అధికారుల” దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం శూన్యం.. బాధ్యతగల అధికారుల సమూహం “తిలాపాపం తలాపిడికెడు” అన్న చందంగా తయారైంది..

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular