ePaper
Wednesday, April 15, 2026
ePaper
Homeఎడిటోరియల్జడేరు జంక్షన్ సమీపంలో కారు పల్టీలు ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

జడేరు జంక్షన్ సమీపంలో కారు పల్టీలు ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

గంగవరం, పెన్ పవర్ ఫిబ్రవరి 27:

పోలవరం జిల్లా గంగవరం మండలం జడేరు జంక్షన్ సమీపంలోని చీడికోట వీధి వద్ద శుక్రవారం సాయంత్రం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సరదాగా ఫోటోలు తీసుకునేందుకు వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురులొ ఒకరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.


మృతుడిని సిద్ధ రోహిత్ రెడ్డి(18) (ఇంటర్ విద్యార్థి)గా పోలీసులు గుర్తించారు. మల్లువలస గౌతమ్ , ఎస్.కె. రకీబ్, కొమ్మోజి రమేష్ కారులో ఉన్నారు. వీరంతా ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని స్థానికుల సహాయంతో అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి లో రకీబ్ గౌతమ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు గంగవరం ఎస్సై వెంకయ్య తెలిపారు. .

RELATED ARTICLES
- Advertisment -

Most Popular