జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా
స్టాఫ్ రిపోర్టర్ పెన్ పవర్, శ్రీకాకుళం. ఫిబ్రవరి 26:
జిల్లాలో వెట్టిచాకిరీని పూర్తిగా రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా పిలుపునిచ్చారు. వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన చట్టం అమలులోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ), నేచర్ ఎన్జీఓ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం జిల్లా కోర్టు ఆవరణలో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి, వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తీసుకున్న అప్పుకు ప్రతిఫలంగా తక్కువ వేతనం లేదా అసలు వేతనం లేకుండా బలవంతంగా పనిచేయించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఈ చట్టం ప్రకారం వెట్టిచాకిరీ కింద ఉన్న పాత అప్పులన్నీ రద్దవుతాయని, బాధితులు ఆ అప్పును తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని, వారి ఆస్తులు యజమాని వద్ద తనఖాలో ఉంటే వాటిని విడిపించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
మరిన్ని అప్ డేట్స్ కోసం epaper.penpower.in చూడండి



