ePaper
Sunday, May 31, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుకూటమి ప్రభుత్వంలో గ్యాస్ కొరత సామాన్యుల తిప్పలు పట్టవా:వైసిపి మండల ఉపాధ్యక్షులు వంతల అరుణ్ ఆగ్రహం.

కూటమి ప్రభుత్వంలో గ్యాస్ కొరత సామాన్యుల తిప్పలు పట్టవా:వైసిపి మండల ఉపాధ్యక్షులు వంతల అరుణ్ ఆగ్రహం.

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్12: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న గ్యాస్ కొరతపై వైసిపి నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు నిత్యావసర సేవలు అందించడంలో విఫలమైందని వారు విమర్శించారు.గ్యాస్ ఏజెన్సీలు సామాన్య ప్రజలకు గ్యాస్ లేదని చెబుతూ,హోటళ్లు మరియు ఇతర దుకాణదారులకు 5 నుండి 10 సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో ఇస్తున్నారని వారు ఆరోపించారు.గ్యాస్ సిలిండర్ అసలు ధర సుమారు ₹960 ఉండగా,కొరతను సాకుగా చూపి వినియోగదారుల నుండి ₹1200 వరకు వసూలు చేయడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.సామాన్య ప్రజలు గ్యాస్ కోసం అడిగితే స్టాక్ లేదని సమాధానం వస్తోందని, ప్రభుత్వం పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు.ఈ అక్రమాలను నిరసిస్తూ వైసిపి ఉపాధ్యక్షులు అరుణ్,పీసా కార్యదర్శి ముక్కలి గిరి,మరియు వైసిపి సీనియర్ నాయకులు కృప తీవ్రంగా ఖండించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టి,సామాన్యులకు నిర్ణీత ధరకే గ్యాస్ అందేలా చూడాలని వారు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular