ePaper
Saturday, March 28, 2026
ePaper
Homeఫ్యాషన్కొత్త లుక్అనంతపురంలో ‘రణబాలి’ షూటింగ్‌

అనంతపురంలో ‘రణబాలి’ షూటింగ్‌

📰 Generate e-Paper Clip

  • విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ‘రణబలి’ షూటింగ్ అనంతపురంలో ప్రారంభం
  • అనంతపురంలో జోరుగా సాగుతున్న ‘రణబలి’ తాజా షెడ్యూల్
  • ‘రణబలి’ చిత్రీకరణకు అనంతపురం వేదిక
  • రాహుల్‌ ‌సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా
  • విజయ్ దేవరకొండ ‘రణబలి’ పాత్రలో కనిపించనున్నారు
  • రష్మిక మందన్న ‘జయమ్మ’ పాత్రలో నటిస్తున్నారు
  •  ‌మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ చిత్రం
  •  టీ సిరీస్‌ సమర్పణలో విడుదలకు సిద్ధం
  • ఏప్రిల్ తొలి వారానికి వరకు షూటింగ్ కొనసాగింపు
  • హీరో-హీరోయిన్‌పై కీలక సన్నివేశాల చిత్రీకరణ
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షూటింగ్ అప్డేట్స్
  • సెప్టెంబర్ 11న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ప్లాన్

ఫిలిం డెస్క్ పెన్ పవర్ మార్చి 28:

‌రీసెంట్‌గా పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన విజయ్‌ ‌దేవరకొండ, రష్మిక మందన్న.. మ్యారేజ్‌ ‌లైఫ్‌ను ఎంజాయ్‌ ‌చేస్తూనే సినిమా షూటింగ్‌లో కూడా జాయిన్‌ ‌కాబోతున్నట్లు తెలుస్తుంది. విజయ్‌ ‌దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ ‌చిత్రం ‘రణబలి’. రాహుల్‌ ‌సంక్రిత్యాన్‌ ‌దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్‌ ‌రణబాలిగా, రష్మిక జయమ్మ పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్‌ ఇం‌డియా చిత్రాన్ని టీ సిరీస్‌ ‌సమర్పణలో ప్రెస్టేజియస్‌ ‌బ్యానర్‌ ‌మైత్రీ మూవీ మేకర్స్ ‌బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 11‌న వరల్డ్ ‌వైడ్‌ ‌గ్రాండ్‌ ‌థియేట్రికల్‌ ‌రిలీజ్‌కు రాబోతుంది. ఈ క్రమంలోనే ఎంజాయ్మెంట్‌ను సైతం పక్కన పెట్టి ఈ జంట షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్‌ ‘‌రణబాలి’ చిత్రీకరణ తాజా షెడ్యూల్‌ ఈ ‌రోజు అనంతపురంలో ప్రారంభమైంది. ఏప్రిల్‌ ‌మొదటి వారం వరకు చిత్రీకరణ కొనసాగుతుండగా ఇందులో రష్మిక, విజయ్‌పై సీన్స్ ‌షూట్‌ ‌చేయనున్నారు చిత్ర బృందం. ప్రజెంట్‌ ఇం‌దుకు సంబంధించిన పోస్టులు వైరల్‌ అవుతుండగా.. పెళ్లైన నెలకే షూటింగ్‌లో పాల్గోన్నారు అంటే డెడికేషన్‌ ‌సూపర్‌ అం‌టూ కామెంట్స్ ‌చేస్తున్నారు ఫ్యాన్స్.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular