Homeటెక్నాలజీమెట్రో స్వాధీనం చేసుకుంటున్నాము

మెట్రో స్వాధీనం చేసుకుంటున్నాము

📰 Generate e-Paper Clip

  • సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
  • ఎల్ అండ్ టీ నుండి మెట్రో స్వాధీనం
  • మెట్రో విస్తరణకు ఎదురైన ఇబ్బందులు
  • ప్రజాప్రయోజనాలు ప్రాధాన్యం
  • స్వాధీనం ప్రక్రియ ప్రారంభం
  • మెట్రో విస్తరణ అడ్డంకులను సమీక్ష
  • నగర ప్రజారవాణా మెరుగుదల లక్ష్యం
  • అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం ప్రణాళికలు
  • అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం
  • సభ్యుల ఏకగ్రీవ ఆమోదం

విరోధాలు మరియు విమర్శలు

  •  మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు
  • ఏకపక్ష తీర్మానం అని వాదన
  • బీఆర్ఎస్ సభ్యుల అభిప్రాయం తీసుకోకపోవడం
  • చర్చ లేకుండా ఆమోదం సమస్య
  • ప్రకటన హక్కు vs సభ ఆమోదం
  • విధానానికి రాజకీయ ప్రతిస్పందనలు
  • మీడియా ప్రతిక్రియలు
  • ప్రజలలో వివాదాస్పద అభిప్రాయం
  • భవిష్యత్తు ప్రణాళికపై ప్రభావం
  • నగర రవాణా విధానాలపై ఆసక్తి

హైదరాబాద్, పెన్ పవర్ మార్చి 28: ‌

హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మెట్రో విస్తరణకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్వాధీన ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా మెట్రో విస్తరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు.మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులను సమీక్షించినట్లు సభకు తెలిపారు. ప్రజారవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచి, ఈ నగరానికి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు కావలసిన ప్రణాళికలను రచించామని అన్నారు. అనంతరం అసెంబ్లీలో మెట్రో స్వాధీనంపై తీర్మానం ప్రవేశపెట్టగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.మెట్రో స్వాధీనంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఇది ఏకగ్రీవ తీర్మానం కాదని, ఏకపక్ష తీర్మానమని అన్నారు. బీఆర్ఎస్ సభ్యుల అభిప్రాయం తీసుకోకుండా ఏకగ్రీవంగా బిల్లును ఎలా ఆమోదింపజేస్తారని ప్రశ్నించారు. ప్రకటన చేసే హక్కు ఉంది కానీ, చర్చ లేకుండా సభ్యులంతా ఆమోదించినట్లు ధన్యవాదాలు చెప్పడం సరికాదని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular