ePaper
Wednesday, March 25, 2026
spot_img
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడఎమ్మార్వో, ఎంపీడీవోలను మర్యాదపూర్వకంగా కలిసిన వర్కింగ్ జర్నలిస్టులు

ఎమ్మార్వో, ఎంపీడీవోలను మర్యాదపూర్వకంగా కలిసిన వర్కింగ్ జర్నలిస్టులు

📰 Generate e-Paper Clip

జర్నలిజం సేవలను ప్రశంసించిన అధికారులు

కాజులూరు, పెన్ పవర్,మార్చి 24:
కాజులూరు మండలంలో వర్కింగ్ జర్నలిస్టుల సేవలను అధికారులు ప్రశంసించారు.మంగళవారం కాజులూరు మండల పరిధిలోని తాసిల్దార్ జి. రవీంద్రనాథ్ ఠాగూర్,ఎంపీడీవో జె. రాంబాబు, వెలుగు ఏపీఎం రాము, మండల విద్యాశాఖ అధికారులు తదితరులను మండల వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ చట్టబద్ధత కలిగిన వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ఏర్పాటుపై అభినంద నలు తెలిపారు.జర్నలిస్టులు నిబద్ధతతో, వాస్తవాలను ప్రజలకు చేరవేసే విధంగా పని చేయాలని సూచించారు. సమాజంలో “ఫోర్త్ ఎస్టేట్”గా జర్నలిజం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని, వార్తలను కచ్చితత్వంతో అందించడం కష్టసాధ్యమైన బాధ్యత అని పేర్కొన్నారు.జర్నలిజం కత్తి మీద సాము లాంటిదని వ్యాఖ్యానించారు.అనంతరం ఎంపీడీవో జె. రాంబాబు ను కలిసిన పాత్రికేయులను ఆయన అభినందించారు.జర్నలిస్టులు ప్రభుత్వం మరియు ప్రజల మధ్య వారధిగా పనిచేయాలని, సమాజంలో జరిగే ప్రతి అంశాన్ని ప్రజలకు చేరవేయడంలో వారి పాత్ర ప్రశంసనీయమని తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన అసో సియేషన్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.వెలుగు ఏపీఎం రాము కూడా జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ఎంఈఓలు డేవిడ్, జాన్‌లను కలిసిన పాత్రికేయులను వారు అభినందించారు. మండలంలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో రవాణా సౌకర్యం కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.డేగల నాగేంద్ర సహకారంతో ఆటో సౌకర్యం ఏర్పాటు చేయడం సామాజిక బాధ్యతకు నిదర్శనమని ప్రశంసించారు. 

ఈ కార్యక్రమంలో (రి.నెం: 101/2026) గౌరవ అధ్యక్షులు దేవు మహేశ్వరరావు, అధ్యక్షులు వీరవల్లి గణపతి, ప్రధాన కార్యదర్శి దడాల ఏడుకొండలు, వైస్ ప్రెసిడెంట్ అనుసూరి శ్రీనివాస్, ట్రెజరర్ కేశన గంగరాజు,జాయింట్ సెక్రెటరీ తోట శివకృష్ణ,ఈసీ సభ్యులు అత్తిలి వెంకటరమణ,పోతుల సత్యకిషోర్,పి. చంద్ర తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ వివరాలు

పేరు: YEDUKONDALU DADALA
హోదా: STAFF REPORTER
ప్రాంతం: KAKINADA DIST
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular