ePaper
Sunday, May 24, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి

ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి

📰 Generate e-Paper Clip

కాజులూరు, పెన్ పవర్, మార్చి 23:
శెట్టిబలిజ జాతి పితామహుడు, సామాజిక విప్లవ నాయకులు, శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి కార్యక్రమం కాజులూరు మండలంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగ శెట్టిబలిజ సంఘ నాయకులు, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం దుగ్గుదూరులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ,శెట్టిబలిజ సంక్షేమ సంఘం ద్వారా బలహీన వర్గాల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించిన మహనీయుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని కొనియాడారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం జయంతిని అధికారికంగా నిర్వహించడం పట్ల కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.దొమ్మేటి వెంకటరెడ్డి స్వాతంత్ర్యానికి పూర్వమే సామాజిక సేవలో నిమగ్నమై, శెట్టిబలిజల అభ్యున్నతికి విశేష కృషి చేశారని తెలిపారు. విద్య ద్వారా సాధికారత సాధ్యమని ఆ కాలంలోనే చాటి చెప్పిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. సామాన్య ప్రజలపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి, వారిలో ధైర్యాన్ని నింపిన ధైర్యశాలి దొమ్మేటి వెంకటరెడ్డి అని స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంతరాయ్, కూటమి పార్టీ నాయకులు, శెట్టిబలిజ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘన నివాళులు అర్పించారు .

RELATED ARTICLES
- Advertisment -

Most Popular