వందల కోట్లు ఖర్చు చేసినా మారని పరిస్థితి..
ధ్వజమెత్తిన ఆకుల సతీష్ టీం.. స్థానికులతో నిరసన..
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిజాంపేట్ సర్కిల్‌లో రోడ్ల దుస్థితి..
దాదాపు 50–100 చోట్ల భారీ గుంతలు.. ప్రమాదాల భారిన ప్రజలు..
రోడ్డుపై స్థానికుల నిరసన..! యంత్రాంగం నిర్లక్ష్యంపై తీవ్రంగా విమర్శలు..!
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనమైనా సమస్యల పరిష్కారం శూన్యం..
దుండిగల్, పెన్ పవర్, మార్చి 1:
నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రధాన రహదారుల దుస్థితిపై ఆకుల సతీష్ టీం ఆందోళన వ్యక్తం చేసింది.. నిజాంపేట్ నుండి బాచుపల్లి- నుండి ప్రగతినగర్,- నుండి జేఎన్టీయూ వరకు ఉన్న ప్రధాన రోడ్లు దాదాపు 50 నుండి 100 ప్రాంతాల్లో భారీగా గుంతలు ఏర్పడి ఉద్యోగస్తులు, వ్యాపారులు, స్థానిక ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.. ఈ నేపథ్యంలో నిజాంపేట్ భవ్యసానంద్ సమీపంలో రోడ్డుపై ఏర్పడిన గుంతల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. వందల కోట్లు ఖర్చు చేసినప్పటికీ కనీసం ప్రధాన రహదారులను కూడా మరమ్మతులు చేయకపోవడం డిప్యూటీ కమిషనర్ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు.. తక్షణమే నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని రోడ్ల గుంతలను పూడ్చి, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..మరోవైపు కాలనీలలో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నాయని ఆరోపించారు.. ప్రజలు ప్రమాదాల భారిన పడుతున్నారని అన్నారు.. నిజాంపేట్ సర్కిల్ అధికారులు, సిబ్బంది అదే రోడ్లలోనే తిరుగుతున్నప్పటికీ ఏమాత్రం చీమకుట్టినట్టు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మౌలిక వసతుల కల్పనలో విఫలమైన నిజాంపేట్ డిప్యూటీ కమిషనర్‌ను తక్షణమే బదిలీ చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించే అధికారిని నియమించాలని కోరారు.. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో నిజాంపేట్ సర్కిల్‌ను కలిపినప్పటికీ పారిశుద్ధ్యం, డ్రైనేజ్ సమస్యలు, చెరువుల్లో గుర్రం డెక్క, మురికి నీరు, దోమల విస్తృతి, గుంతల రోడ్లు వంటి అనేక ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో అమలేశ్వరి, అరుణ్, వినయ్, సువాసిని శక్తి, ప్రసాద్, శశి, హనుమయ్య, మురళి, పాండు, సతీష్, ఎల్ల స్వామి, శ్రీనివాస్, రాము, గోవర్ధన్, సరోజ, సముద్ర వాణి తదితరులు పాల్గొన్నారు.


