ePaper
Monday, March 2, 2026
spot_img
ePaper
Homeఎడిటోరియల్సమస్యల సుడిగుండంలో హఫీజ్‌పేట్..

సమస్యల సుడిగుండంలో హఫీజ్‌పేట్..

📰 Generate e-Paper Clip

హఫీజ్‌పేట్‌లో రోడ్లపై పారుతున్న డ్రెయినేజీ నీటిని పరిశీలిస్తున్న బీజేపీ నాయకులు..

డ్రైనేజీ మురుగునీటి దుర్వాసనలో మునిగిన కాలనీలు..

డ్రైనేజీ, రోడ్లు, బస్తీ దవాఖాన దుస్థితిపై బీజేపీ ఆగ్రహం..

కూకట్‌పల్లి, పెన్ పవర్, మార్చి 1:

హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ నాయకులు స్థానిక సమస్యలపై ప్రత్యక్ష పర్యటన చేపట్టారు.. హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో హుడా కాలనీ, గంగారం ప్రాంతాల్లో డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం వంటి పెండింగ్ సమస్యలను పరిశీలించారు.. ఈ సందర్భంగా గంగారాం బస్తీ దవాఖానను సందర్శించిన నాయకులు అక్కడి మౌలిక వసతుల పరిస్థితిని పరిశీలించారు. వైద్య సిబ్బంది అందుబాటు, శుభ్రత, అవసరమైన ఔషధాల లభ్యత వంటి అంశాలపై వివరాలు సేకరించారు.. స్థానిక కాలనీలలో ప్రజలను కలిసిన బీజేపీ నాయకులు, సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో డ్రైనేజీ నీరు రోడ్లపై నిల్వ ఉండటం, గుంతలతో రోడ్లు దెబ్బతినడం, పారిశుధ్య లోపాల వల్ల వ్యాధులు ప్రబలి అనారోగ్యానికి గురైనట్లు ప్రజలు వాపోయారు.. పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కోరారు.. నిర్లక్ష్యం వహిస్తే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్, బీజేపీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి డాక్టర్ అజిత్ సేనాపతి, సీనియర్ నాయకులు దేవాల్ యాదవ్, మోహన్ ముదిరాజ్, డివిజన్ కార్యదర్శి రాజు యాదవ్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి బాలరాజు, నాయకులు పవన్ కుమార్, రామకృష్ణ, మునిస్వామి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular