ePaper
Thursday, April 30, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంఎంపీడీఓ కుమార్ ఆధ్వర్యంలో నీటి భద్రతపై సమావేశం...

ఎంపీడీఓ కుమార్ ఆధ్వర్యంలో నీటి భద్రతపై సమావేశం…

📰 Generate e-Paper Clip

అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్ 07:అడ్డతీగల మండలంలో “నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత” ప్రత్యేక కార్యక్రమం నేపథ్యంలో ఎంపీడీఓ కుమార్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, మైక్రో ఇరిగేషన్ పద్ధతుల అమలు, చెక్‌డ్యామ్‌లు–ఫార్మ్‌పాండ్ల నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. కార్యక్రమం విజయవంతానికి సచివాలయ సిబ్బంది, నీటి వినియోగదారుల సంఘాలు సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీఓ కుమార్ సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular