ePaper
Thursday, April 30, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంగృహ లెక్కల సర్వే మే నెలలో నిర్వహణ

గృహ లెక్కల సర్వే మే నెలలో నిర్వహణ

📰 Generate e-Paper Clip

చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 30:

చింతూరు డివిజన్‌లో గృహ లెక్కల కార్యక్రమం మే 1 నుంచి ప్రారంభం కానుంది. ప్రాజెక్ట్ అధికారి, ఐటిడిఏ చింతూరు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మే 31 వరకు కొనసాగనుందని అధికారికంగా తెలియజేశారు. ఈ గృహ గణనలో భాగంగా ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యుల వివరాలు, గృహ సమాచారం తదితర అంశాలను సేకరించి సెన్సస్ యాప్ ద్వారా డిజిటల్‌గా నమోదు చేయనున్నారు. ఈ సమాచారం ప్రభుత్వానికి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు రూపకల్పనలో కీలకంగా ఉపయోగపడనుంది. కూనవరం, చింతూరు, వి.ఆర్.పురం, యటపాక మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం అమలు చేయబడుతుంది. గృహ గణనకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కారం కోసం ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఎన్యూమరేషన్ సిబ్బందికి పూర్తి సహకారం అందించి, అవసరమైన సమాచారాన్ని నిజాయితీగా ఇవ్వాలని అధికారులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular