శాంతిభద్రతలు కట్టుదిట్టం
కాకినాడ, పెన్ పవర్,ఏప్రిల్ 13:
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులు సూచించారు.కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దేవరాజ్ పాటిల్ మానిష్ గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని శలపాక గ్రామం చిన్నపేటలో ఉన్న డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జయంతి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేలా కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు.కార్యక్రమాల సమయంలో ఎలాంటి గొడవలు, ఉద్రిక్తతలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సామరస్య వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని గ్రామ పెద్దలకు సూచించారు. అలాగే శలపాక గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలను కూడా ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో గొల్లపాలెం ఎస్‌ఐ ఎం. మోహన్ కుమార్, పోలీస్ సిబ్బంది,గ్రామస్తులు పాల్గొన్నారు.

