ePaper
Wednesday, April 8, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుచింతపల్లి నియోజకవర్గ పునరుద్ధరణకు తీర్మానం

చింతపల్లి నియోజకవర్గ పునరుద్ధరణకు తీర్మానం

గూడెంకొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్ 7: జీకే వీధి మండల సర్వసభ్య సమావేశంలో చింతపల్లి శాసనసభ నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మండల ఎంపీపీ బోయినకుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికారులు హాజరు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తమైంది.ఆర్వీ నగర్–సీలేరు రహదారి పనుల జాప్యం, గ్రామాల్లో ఉపాధ్యాయుల గైర్హాజరు, గ్యాస్ సరఫరాలో అవ్యవస్థలు వంటి సమస్యలను సభ్యులు ప్రస్తావించారు. చెక్‌డ్యామ్ నిర్మాణం రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన కాఫీ రైతుల పంట కొనుగోలు సమస్యపై కూడా చర్చించారు.ఈ సమావేశంలో ఎంపీడీవో రమణబాబు, తహసీల్దార్ అన్నాజీరావు తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular