ePaper
Tuesday, May 26, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంపోషణ పక్వాడ ద్వారా బాలల మేధాశక్తి పెంపు లక్ష్యం

పోషణ పక్వాడ ద్వారా బాలల మేధాశక్తి పెంపు లక్ష్యం

📰 Generate e-Paper Clip

 

జిల్లా జాయింట్ కలెక్టర్ స్మరణ రాజ్

గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్ ఏప్రిల్ 8:
పోలవరం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో బాలబాలికల మేధాశక్తి పెంపొందించేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ తెలిపారు.బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో 2026 సంవత్సరం 8వ పోషణ పక్వాడ పోస్టర్‌ను జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 8 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ప్రతి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలల మేధో వికాసం కోసం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 8వ పోషణ పక్వాడ కార్యక్రమం ఈ నెల 9 నుండి 23వ తేదీ వరకు ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిధిలో నిర్వహించనున్నట్లు చెప్పారు.తల్లి-శిశు పోషణ, 0–3 సంవత్సరాల పిల్లల మెదడు అభివృద్ధి, 3–6 సంవత్సరాల పిల్లలకు ఆటల ఆధారిత విద్య, తల్లిదండ్రుల పాత్ర, స్క్రీన్ టైం తగ్గింపు వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు వివరించారు. అలాగే సమాజ మద్దతుతో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.ప్రతి కేంద్రంలో బాలలకు ఆటపాటల ద్వారా విద్యపై ఆసక్తి పెంచే విధంగా అంగన్వాడీ టీచర్లు పనిచేయాలని, గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం పౌష్టికాహారం అందించాల్సిందిగా ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కె. ఉమా, డీఎంహెచ్ఓ పి. సరిత, ఐసీడీఎస్ సూపర్వైజర్లు సిహెచ్. రాఘవ, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular