ePaper
Tuesday, April 14, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుజనగణన మొదటి విడత శిక్షణ ప్రారంభం:తహసీల్దార్ హెచ్. అన్నాజీ రావు

జనగణన మొదటి విడత శిక్షణ ప్రారంభం:తహసీల్దార్ హెచ్. అన్నాజీ రావు

గూడెంకొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 13:మండలంలో జనగణన ప్రక్రియకు సంబంధించిన మొదటి విడత శిక్షణ కార్యక్రమం ఏప్రిల్ 13వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రారంభమైంది.ఈ శిక్షణ కార్యక్రమంలో మొదటి విడతగా 49 మంది ఎన్యుమరేటర్లు సూపర్వైజర్లకు ప్రత్యేకంగా శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.జనగణన నిర్వహణలో అనుసరించాల్సిన విధానాలు, డేటా సేకరణ పద్ధతులు, సాంకేతిక అంశాలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు.ఈ సందర్భంగా గూడెంకొత్తవీధి మండల తహసీల్దార్ హెచ్. అన్నాజీ రావు మాట్లాడుతూ జనగణన ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ ఎంతో కీలకమని తెలిపారు.అలాగే ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్వీయ గణన కార్యక్రమం నిర్వహించబడుతుందని ఆయన వెల్లడించారు. ప్రజల సహకారంతో గణన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular