గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 8:
గ్రామంలో తాగునీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కొల్లేరు పంచాయతీ ప్రత్యేక అధికారి డిప్యూటీ ఎంపీడీవో గోపన్న దొర ఆదేశించారు .స్వర్ణ మొల్లేరు గ్రామంలో తాగునీటి సమస్యను అత్యవసరంగా పరిష్కరించేందుకు కూటమి నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు.స్వర్ణ గ్రామ అధికారి మరియు పంచాయతీ ప్రత్యేక అధికారి కె. గోపన్న దొర ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నీటి సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్ డబ్ల్యు పి సి కేంద్రాన్ని సందర్శించి, గ్రామ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు. ప్రతిరోజూ డోర్ టు డోర్ చెత్త సేకరణ నిర్వహించి గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.ఈ కార్యక్రమం లో పిఎసిఎస్ చైర్మన్ పాము అర్జున్, నీటి సంఘం అధ్యక్షులు జి. శ్రీరాములు, ఎన్. వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి ఎస్. వీరభద్రరావు, సచివాలయ సిబ్బంది డి. వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

