ePaper
Friday, April 3, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడపంచాయతీలకు ప్రత్యేకాధికారులు నియామకం

పంచాయతీలకు ప్రత్యేకాధికారులు నియామకం

కాజులూరు మండలంలో సర్పంచ్ పాలనకు ముగింపు

– ప్రభుత్వం జీఓ నెం.47 విడుదల
కాజులూరు, ఏప్రిల్ 2 (పెన్‌పవర్): రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ గ్రామపంచాయతీల్లో సర్పంచ్ పాలనకు గురువారంతో ముగింపు పలికింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ జీఓ నెం.47ను విడుదల చేసింది. ఈ మేరకు మండల స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించింది.
ఈ నేపథ్యంలో కాజులూరు మండలంలో తహశీల్దార్ జి.ఆర్.ఠాగూర్, ఎంపీడీవో జె.రాంబాబు, అగ్రికల్చర్ ఆఫీసర్ వి.అశోక్, ఎంఈవో-1 డి.డేవిడ్, ఎంఈవో-2 పి.జాన్, డిప్యూటీ ఎంపీడీవో ఎం.సత్యనారాయణ మూర్తి (ఎస్‌జీఎస్‌డబ్ల్యూ)లను ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వం నియమించింది.
గ్రామాల వారీగా నియామకాలు ఇలా ఉన్నాయి:
అండ్రింగి, చేదువాడ, పెదలంక, తనుమళ్ల – వ్యవసాయ అధికారి వి.అశోక్
ఆర్యవటం, గొల్లపాలెం, కాజులూరు, కుయ్యేరు, మంజేరు, పెనుమళ్ల – ఎంపీడీవో జె.రాంబాబు
బందనపూడి, దుగ్గుదూరు, కోలంక, పల్లిపాలెం – తహశీల్దార్ జి.ఆర్.ఠాగూర్
ఐతపూడి, జగన్నాధగిరి, టి.మామిడాడ, తర్లంపూడి – ఎంఈవో-2 పి.జాన్
మతుకుమిల్లి, ఒంటితాడి, శీల, తిప్పరాజుపాలెం – డిప్యూటీ ఎంపీడీవో ఎం.సత్యనారాయణ మూర్తి
నామవానిపాలెం, శలపాక, తణుకువాడ, ఉప్పుమిల్లి – ఎంఈవో-1 డి.డేవిడ్
ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం శుక్రవారం నుంచి ఆయా గ్రామపంచాయతీల్లో ప్రత్యేకాధికారులు బాధ్యతలు స్వీకరించనున్నారు. గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular